పూలే స్ఫూర్తికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్

Published on

.
రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తికి విరుద్ధంగా పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని,కాంగ్రెస్ కు బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల ప్రజలు దూరంగా వుండాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు.

ఎమ్మార్పిఎస్ జాతీయ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డప్పు మల్లికార్జున్ మాదిగ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు రెండు ఎంపీ స్థానాలు మాత్రమే ఇచ్చి 4 శాతం జనాబా కూడా లేని రెడ్డిలకు 6 ఎంపీ స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బిసిలకు ద్రోహం చేసిందని విమర్శించారు.

12శాతం జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, బిసి,ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పలికే అర్హత లేదని అన్నారు. ఒక వైపు పులే ఆశయాలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తూనే… మరొక వైపు పూలే గురించి కీర్తిస్తూ మాట్లాడం కాంగ్రెస్ సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నిజంగా పూలే మీద కాంగ్రెస్ కు గౌరవం ఉంటే సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి, జనాభా ప్రాతిపదికన లోక్ సభ టికెట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ పరిపాలనలో తెలంగాణ రెడ్ల రాజ్యంగా మారిందని ఆరోపించారు. ఇది సామాజిక సమానత్వానికి బద్ద వ్యతిరేకం అని పేర్కొన్నారు. పూలే ఎన్నో కష్టాలు,నష్టాలకు ఓర్చుకొని దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించి, చదువును అందించాడని గుర్తు చేశారు. పూలే వల్లనే నేడు దేశంలో కోట్లాది మంది అణగారిన వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి,సమాజ ప్రయోజకులు అవుతున్నారని స్పష్టం చేశారు.

సామాజిక సమానత్వం, మహిళా విముక్తి, అణగారిన వర్గాల రాజకీయ అధికారం పులే ఆశయాలని అన్నారు. పూలే ఆశయాలు సాధించడానికి కాంగ్రెస్లో అవగింజంత ఆలోచన కూడా లేదని అన్నారు. పూలే ఆశయాలను సాధించడానికి ప్రజలు ముందుకు సాగాలని. బీసీ, ఎస్సీ ఎస్టీ లకు వ్యతరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని లోక్ సభ ఎన్నికల్లో ఓడించడమే పూలేకి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర బిక్షపతి మాదిగ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బైరపోగు శివ మాదిగ, గజ్జల రాజశేఖర్ మాదిగ,
తుమ్మల శివప్రసాద్ మాదిగ, కొప్పుల సాయికుమార్ మాదిగ, దేవేందర్ మాదిగ, సూరారం సుజాత మాదిగ,, చెండేటి వేణుగోపాల్ మాదిగ ,రఘు మాదిగ,డప్పు మహేష్ మాదిగ, మురళీధర్ మాదిగ, నాని మాదిగ, తదితరులు పాల్గొన్నారు

Search

Latest Updates