మాదిగలు రాజకీయ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి సన్నద్దం కావాలి. మంద కృష్ణ మాదిగ.

Published on

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ జాతికి సీట్లు కేటాయించకుండ అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతో రాజకీయ గణపాఠం చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. వంరంగల్ జిల్లాలో బుధవారం నిర్వహించిన మాదిగ లాయర్ల ఫెడరేషన్ ,రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ లు మాదిగలకు రిజర్వేషన్ ప్రకారం సీట్ల కెటాయించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు.

స్వాతంత్రయ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు లాయర్లు, మేధావులు క్రీయాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.ఎస్సీ వర్గీకరణ తోనే మాదిగల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్పష్టం చేశారు. జాతి భవిష్యత్తు కోసం మాదిగలు అన్ని విధాలుగా సంసిద్దం కావాలని సూచించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎస్సీ వర్గీకరణ పై హామి ఇచ్చిన నేపథ్యంలో జాతి భవిష్యత్తు కోసమే బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీఆర్పీఎస్ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.మాదిగలు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా తమ బిడ్డలు భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని కోరారు. ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ తో మాదిగలు విద్యా,ఆర్థిక, రాజీకయ,సామాజికంగా ఎంతో నష్టపోయారని తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని ఎస్సీ వర్గీకరణ కోసం నిర్ధిష్టమైన కార్యాచరణం తో ముందుకు పోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికలు జాతి భవిష్యత్తుకు ఎంతో కీలకమని మాదిగ జాతి గ్రహించాలని సూచించారు.


కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కేటాయించకుండ మాదిగలను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీలకు కేటాయించిన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపెల్లి సీట్లలో ఒక్కటి కూడా మాదిగలకు దక్కలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమే ధ్యేయం గా జాతి భవిష్యత్తు లక్ష్యంగా మాదిగ జాతి ముందుకు సాగాలని సూచించారు.. ఈ కార్యక్రంలో ఎం ఎల్ ఎఫ్ జాతి అధ్యక్షులు వివి వెంకటరత్నం మాదిగ, హనుమకొండ బార్ ప్రెసిడెంట్ మాతంగి రమేష్ బాబు, హనుమకొండ స్పోర్ట్స్ సెక్రటరీ పి. చిరంజీవి, వరంగల్ సెక్రటరీ గోపిక రాణి, ఎం ఎల్ ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొంగర పూర్ణచందర్, హనుమకొండ ఎం ఎల్ ఎఫ్ అధ్యక్షుడు గోవిందు నాగభూషణం, అధికార ప్రతినిధి మంద సుభాష్, వరంగల్ ఎం ఎల్ ఎఫ్ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, ఎం ఎల్ ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ అమృతరావ్ తదితరులు పాల్గొన్నారు

Search

Latest Updates