AP CM బాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మంద కృష్ణ మాదిగ

Published on

హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారిని వారి నివాసంలో ఎమ్మార్పీఎస్ అదినేత శ్రీ మంద కృష్ణ మాదిగ గారు కలిశారు.

సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమం విజయాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి పురుడుపోసి ఆయుధంగా మలిచిన చంద్రబాబు నాయుడు గారికి మంద కృష్ణ మాదిగ గారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు గారికి శాలువా కప్పి పుష్ప గుచ్చo అందించి మంద కృష్ణ మాదిగ గారు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టమే సుప్రీం కోర్టు న్యాయ విచారణలో విజయం సాధించిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ మొదటి అమలు చేసింది చంద్రబాబు గారే అలాగే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన తరువాత అమలు జరగాల్సిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉండడం శుభ పరిణామమని అన్నారు.

త్వరగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రావాలని కోరారు.

ముప్ఫై ఏళ్ళు మడమ తిప్పకుండా గట్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని మంద కృష్ణ మాదిగ గారిని చంద్రబాబు నాయుడు గారు అభినందించారు.

ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ గారికి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు….

Search

Latest Updates

Subscribe

Subscription Form