News Network

Youtube X-twitter Facebook-square Instagram Threads
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • సినిమా
  • విశ్లేషణ
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
Menu
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • సినిమా
  • విశ్లేషణ
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ

News Network

Youtube X-twitter Facebook-square Instagram Threads
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • సినిమా
  • విశ్లేషణ
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • సినిమా
  • విశ్లేషణ
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ

Home » కాంగ్రెస్ ను రాజకీయంగా బొంద పెడతాం : మంద కృష్ణ మాదిగ

కాంగ్రెస్ ను రాజకీయంగా బొంద పెడతాం : మంద కృష్ణ మాదిగ

04/05/2024
in News
Reading Time: 5 mins read
0
0
VIEWS

మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి వైఖరి నశించెంతవరకు పోరాడతాం

మాదిగలను మోసం చేసిన పార్టీలన్నీ భూస్థాపితం అయ్యాయి రేపు కాంగ్రెస్ పార్టీ గతి అంతే

MRPS ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మాదిగల మహాధర్నా

మే 04 (ఇందిరా పార్క్) : పార్లమెంట్ ఎన్నికల సీట్లలో మాదిగలకు ఒక్కటి కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాధర్నా ను నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారు , మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేతకాని గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ మాదిగలు, నేతకాని,బీసీ లందరూ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏనాడు లేని అవమానం ఈ కాంగ్రెస్ పాలనలో మాదిగలకు జరిగిందని ఏ ఒక్క మాదిగ బిడ్డ కాంగ్రెస్ కు ఓటు వేయాల్సిన అవసరం లేదని అన్నారు. మాదిగలకు చేసిన అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికే రేవంత్ రెడ్డి తన భజన పరులతో గాంధీభవన్ లో రాజ్యాంగం ప్రమాదంలో పడిందనే బుటకపు మాటలతో ధర్నా కార్యక్రమాన్ని పెట్టాడని నరేంద్ర మోడి గారే నిజానికి భారత రాజ్యాంగానికి రక్షణ కవచం లాంటివాడిని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రేసేతర పార్టీలే ఎస్సీ, ఎస్టీ లకు జనాభా దామాష ప్రకారం పెంచాయని, కానీ కాంగ్రెస్సే ఏనాడు పెంచకుండా మోసం చేసిందని అన్నారు. ప్రమాదం వచ్చింది భారత రాజ్యాంగానికో రిజర్వేషన్లకు కాదని మోడీ గారి సుపరిపాలనతో కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం మాత్రం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జైపూర్ నియమావలికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కయి ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటాయించాడని, తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో 80% గల మాదిగలకు మాత్రం ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు బీసీ లు, మాదిగలు ఓటు వేశారని కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క ఓటు కూడా ,ఒక సీటు కూడా ఎక్కువ రాదని మాదిగలు నేతకానిలు బీసీలందరూ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని సవాలు విసిరారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడితూ ఈ రేవంత్ రెడ్డి వైఖరితో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని,చరిత్రలో ఏ పార్టీ చేయని ద్రోహం కాంగ్రెస్ చేసిందని అన్నారు. నేను ఎందరో ముఖ్యమంత్రిలను చూశాను కానీ రేవంత్ రెడ్డి లాంటి రెడ్డి అహంకారిని నా జీవితంలో చూడలేదని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికే రాజ్యాంగంపై రిజర్వేషన్లపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగు దశబ్దల రాజకీయ ప్రస్తావన ఉన్న నాకు ,అత్యంత సీనియర్ నాయకుడైన నాకే రేవంత్ రెడ్డి మాదిగ జాతి ఆవేదన తెలపడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ నేతకాని మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారి స్ఫూర్తితోనే నా పేరు చివరన నేతకాని పెట్టుకున్నానని జాతికి ఆత్మగౌరవం లేకుండా అవమానించిన కాంగ్రెస్ కు కృష్ణ మాదిగ, మోత్కుపల్లి గారి పిలుపుతో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,BC రాజ్యాధికార సమితి నాయకుడు సురేష్ గారు, కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి వంశి తిలక్ గారు, MRPS జాతీయ నాయకుడు రాగటి సత్యం మాదిగ, MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, MRPS జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, సూరన్న కాపు, జానకి రామయ్య చౌదరి,MRPS జాతీయాధికార ప్రతినిధి బొర్ర బిక్షపతి మాదిగ,VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్ గారు,MSP హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరసింహ మాదిగ, ఇంచార్జీ ఇనుముల నరసయ్య మాదిగ,MSF రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ, అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మార్పీఎస్ నాయకత్వం మరియు మాదిగలు వేల సంఖ్యలో మహధర్నాలో పాల్గొన్నారు….

Tags: CmRevanth reddycongressHyderabadManda Krishna MadigaMRPSTelangana

Related Posts

AP CM బాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మంద కృష్ణ మాదిగ
Andhrapradesh

AP CM బాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మంద కృష్ణ మాదిగ

బాలగోపాల్ రచనలు ఎస్సీ వర్గీకరణకు దారి చూపెట్టాయి.
Dalit Issues

బాలగోపాల్ రచనలు ఎస్సీ వర్గీకరణకు దారి చూపెట్టాయి.

మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం
News

మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం

మహిళా ఎంపీపై లైంగిక దాడి
Crime

మహిళా ఎంపీపై లైంగిక దాడి

మధు యాష్కీకి తప్పిన ప్రమాదం
News

మధు యాష్కీకి తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి
Latest News

బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: రాహుల్
National

దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: రాహుల్

అంతరిక్ష పరిశోధకులకు శుభవార్త ..స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు
National

అంతరిక్ష పరిశోధకులకు శుభవార్త ..స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

నేడు తెలంగాణకు అమిత్ షా
Latest News

నేడు తెలంగాణకు అమిత్ షా

Youtube X-twitter Facebook-square Instagram Threads

Copyright © 2023 · M7 News Network

Powered by.  Navasakam Media House 

Subscribe

Subscription Form
  • Join WhatsApp Group
  • Subscribe Youtube
  • Like Facebook Page
  • Follow Insta
  • Follow Twitter
  • Follow Threads