కాంగ్రెస్ చేసిన అవమానానికి నిరసనగా రేపు మాదిగల మహాధర్నా :ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్

Published on

కాంగ్రెస్ అంతమే మాదిగల పంతం

  • ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఒక్క సీటు కూడా కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన అవమానాన్ని నిరసిస్తూ రేపు 4 వ తేదిన హైదరాబాద్ , ఇందిరా పార్క్ వద్ద మాదిగల మహాధర్నాను నిర్వహిస్తున్నామని , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల నుండి మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. బన్సిలాల్ పేట డివిజన్ కమ్యూనిటీ హాల్ లో హైదరాబాద్ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం టీవీ నరసింహ మాదిగ అద్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీల జాబితాలో నుండి మాదిగలను తొలగించినట్లుగా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అని అన్నారు. తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి వారికి 8 ఎంపీ టికెట్లు ఇప్పిచుకున్న రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదలకు జీవం పోసిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇప్పించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిందని ఘోరమైన నమ్మక ద్రోహామని అన్నారు.ప్రాతినిధ్యం అనేది మాదిగల ఆత్మగౌరవ సమస్య అని, చరిత్రలో మాదిగలకు ఇంత ఘోరంగా అవమానించిన ముఖ్యమంత్రి లేడని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతం మాదిగల పంతంగా జాతి ముందుకూ సాగుతుందని అన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ చేసిన అవమానాన్ని నిరసిస్తూ రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రివర్యులు, మోత్కుపల్లి నర్సింహులు గారు పాల్గొంటారని తెలియజేశారు.మాదిగలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో MSP జాతీయ నాయకులు ఏపురి వెంకటేశ్వర్ రావు,MSP జిల్లా ఇంచార్జీ ఇనుముల నర్సయ్య, జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లిఖార్జున్ మాదిగ, సీనియర్ నాయకులు కడార్ల నవీన్ , స్థానిక నేతలు కుమార్ బాబు మాదిగ, సుచ్చింద్ర మాదిగ , ఆదిత్య ప్రవీణ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Search

Latest Updates