వరుసగా పెట్రో బాదుడు

Published on

– నాలుగు రోజుల్లోనే పెట్రోల్‌పై రూ.4.07 పైసలు, డీజీల్‌పై 79 పైసలు పెరుగుదల

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రో భారం పడుతూనే ఉంది. వాహనదారుల నడ్డి విరుస్తూ.. పెట్రోల్‌ ధరలు వరుసగా నాల్గో రోజు కూడా పెరిగాయి. డీజిల్‌ ధరలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నయి. దీంతో వాహనదారులు షాక్‌ అవుతున్నారు. నాలుగు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4.07 పైసలు, డీజీల్‌పై 79 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర సోమవారం 7 పైసలు పెరుగుదలతో రూ.81.53కు చేరింది. అలాగే, లీటర్‌ డీజిల్‌ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.71.25కు ఎగసింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.88.23 చేరింది. డీజిల్‌ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.77.73కు చేరింది. హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్‌ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.84.80కు చేరింది. డీజిల్‌ ధర కూడా 19 పైసలు పెరుగుదలతో రూ.77.75ను తాకింది. ఏపీ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పరిస్థితి ఇలానే ఉంది.

Search

Latest Updates