వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

Published on

భారతదేశ చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని పేరు గాడ్సే. మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ హంతకుడిగానే గాడ్సే అందరికి తెలుసు. స్వాతంత్య్రానంతరం భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది.

గాంధీ హత్య నేపథ్యంలో భారతదేశంలో ఒక నవలగాని, సినిమా గాని రాకపోవడం దారుణం. ఈ తప్పుని సరిచేయాలనే లక్ష్యంతో ‘మరణ వాగ్మూలం’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాలనుకున్నారు. ఈ దేశ ప్రజల ముందు వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రమే కాదు గాడ్సేది విస్మరించాల్సిన అధ్యాయం కాదు అని చెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమాని. డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భరద్వాజ్‌ మాట్లాడుతూ, ‘గాడ్సే భావాజాలాన్ని తెలియజేసే సినిమా ఇది. దేశంలో మత సామరస్యం ఉండాలి. ఓపెన్‌గా గాడ్సే గురించి చెప్పాలనే ప్రయత్నమిది. అంతా కొత్తవారితో ఈ సినిమా చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై రీసెర్చ్‌ చేశాను. మొదట ఈ సబ్జెక్ట్‌ మీద ఓ నవల రాద్దామనుకున్నాను. అయితే గాడ్సే భావాజాలాన్ని చెప్పడానికి సినిమానే కరెక్ట్‌ అనిపించింది. గాంధీ తమ్ముడు గోపాల్‌ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మరణించాడు. గాంధీ హత్యలో అతని పాత్ర ఏమిటి?, ఎలా ఇన్వాల్వ్‌ అయ్యాడు వంటి అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అని చెప్పారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ మాట్లాడుతూ,’ గాడ్సే రాసిన పుస్తకం అందరిని ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్‌లో తన వాగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది. అసలు గాడ్సే ఎలా విలన్‌ అయ్యాడు వంటి విషయాలను భరద్వాజ్‌ ఈ సినిమాలో చెప్పబోతున్నారు’ అని తెలిపారు. దర్శకుడు కరుణ కుమార్‌ మాట్లాడుతూ,’ నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్న భరద్వాజ్‌ గారు చేస్తున్న ఈ సినిమాని ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు’ అని చెప్పారు. సూరజ్‌ మాట్లాడుతూ,’ డైరెక్టర్‌ భరద్వాజ్‌ గాడ్సే మీద సినిమా అనగానే ఆసక్తికరంగా అనిపించింది. డిసెంబర్‌లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేస్తాం’ అని చెప్పారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates