అంతుచిక్కని లెక్కలు!

Published on

– క్యూ2 భారీగా పెరిగిన తయారీ రంగం
– పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
– పొంతన లేని కేంద్ర గణంకాలు
– నిపుణుల్లో తీవ్ర అనుమానాలు

గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రతికూలతలో ఉన్న తయారీ రంగం ఉన్నట్టుండి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పుంజుకోవడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మైనస్‌ 7.5 శాతం పతనమైందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గణంకాల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతక్రితం జూన్‌ త్రైమాసికం(క్యూ1)లో జీడీపీ ఏకంగా 23.9 శాతం క్షీణించింది. 2020 జూన్‌ త్రైమాసికంలో తయారీ రంగం మైనస్‌ 39 శాతం పతనాన్ని చవి చూడగా.. క్రితం క్యూ2లో ఈ రంగం అనుహ్యంగా 0.6 శాతం పె రుగుదలను నమోదు చేసింది. మైనస్‌ 40 శాతం చేరువలో ఉన్న తయారీ రంగం ఒకే సారి ఏకంగా సానుకూల వృద్థిని నమోదు చేసిందన్న గణంకాలు తమను విస్మయానికి గురి చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ”కరోనా సంక్షోభానికి ముందే ఈ రంగం ఒత్తిడిలో ఉండగా.. లాక్‌డౌన్‌ నిబంధనలతో పూర్తిగా డీలా పడింది. దేశంలోనే కోట్లాది ఉద్యోగాలు పోయాయి. దాదాపుగా అన్ని రంగాల్లో వేతన కోతలు విధించబడ్డాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయింది. ఇలాంటి ప్రతికూల సమయంలో తయార రంగానికి ఎక్కడ లేని జీవసత్వాలు ఎలా వచ్చాయి” అని నిపుణులు ఆలోచనల్లో పడ్డారు. జూన్‌ త్రై మాసికంలో పారిశ్రామిక రంగం ఏకంగా మైనస్‌ 38 శాతం పతనాన్ని చవి చూ డగా.. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ 2.1 శాతం ప్రతికూల వృద్థిని నమో దు చేసింది. పారిశ్రామిక రంగం మైనస్‌ వృద్థి రేటును చవి చూడగా.. తయారీ రంగం మాత్రం సానుకూల పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం.

గత వారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణంకాలు తమను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఎస్బీఐ గ్రూపు రీసెర్చ్‌ విభాగం ఆర్థిక నిపుణులు సౌమ్య క్రాంతి ఘోష్‌ అన్నారు. అందులోనూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తయారీ రంగం భారీగా పెరగడం విస్మయానికి గురి చేసిందన్నారు. క్యూ1లో భారీగా పత నమైన తయారీ రంగం అమాంతంగా పెరగడం అర్థం కాని అంశమన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (జులై-ఆగస్టు-సెప్టెంబర్‌)లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో తయారీ రంగం 6.7 శాతం క్షీణించిందనీ.. ఇదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాస్తవ విలువ 0.6 శాతం ఎలా పెరిగిందో అర్థం కాని అంశమన్నారు.

ద్వితీయ త్రైమాసికంలో తయారీ రంగం అనుహ్యాంగా ఎలా పెరిగిందో స్పష్టత లేదని ఇక్రా రేటింగ్‌ ఎజెన్సీ ప్రిన్సిపల్‌ ఎకనామిస్ట్‌ అదితి నయ్యర్‌ అన్నారు. జీడీపీ గణంకాల్లో అనేకాంశాలు ప్రతిభింబించడం లేదన్నారు. తయారీ రంగ ఉత్పత్తులు ఇప్పటికీ సరఫరాలో తగ్గుదలను ఎదుర్కొంటున్నాయని.. అయినా సానుకూల వృద్థిని చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రిన్సిపల్‌ ఎకనామిస్ట్‌ సునీల్‌ కుమార్‌ సిన్హా అన్నారు. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో వ్యవసాయం, అడవులు, మత్సశాఖ రంగాలు 3.4 శాతం మేర వృద్థిని కనబర్చాయి. మరోవైపు వాణిజ్యం, హోటళ్లు ఏకంగా మైనస్‌ 15 శాతం పతనాన్ని చవి చూశాయి. రక్షణ, ఇతర రంగాలు 12 శాతం ప్రతికూల వృద్థిని ఎదుర్కొన్నాయి. విత్త, రియల్‌ ఎస్టేట్‌, నైపుణ్య సర్వీసుల రంగాలు మైనస్‌ 8.1 శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే 24 ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత జీడీపీ అత్యంత పేలవంగా ఉందని అనేక రిపోర్ట్‌లు పేర్కొన్నాయి.

భవిష్యతు మరింత పేలవం : ప్రణాబ్‌ సేన్‌
సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో తయారీ రంగం అనుహ్యాంగా 0.6 శాతం పెరగడం పట్ల ఆర్థిక గణంకాల శాఖ మాజీ ముఖ్య అ ధిక్ణారి ప్రణ్‌బ్‌ సేన్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఈ రంగం క్షీణిస్తే పెరిగినట్టు చూపించారని విమర్శించారు. ప్రస్తుత డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలోనూ తయారీరంగం ప్రతికూల వృద్థిని చవి చూడనుందన్నారు. సేన్‌ ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ గ్రోత్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా, ప్రభుత్వ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ ఎక నా మిక్స్‌ స్టాటిస్టిక్స్‌ చైర్మెన్‌గా ఉన్నారు. క్యూ2తో పోల్చితే మూడో త్రైమాసికంలో జీడీప మరింత పడిపోయే అవకాశాలున్నాయన్నారు. మార్చితే ముగిసే త్రైమా సికంలోనూ ప్రతికూల గణంకాలే రావొచ్చన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 శాతం పైనే క్షీణించొచ్చని అంచనా వేశారు. వచ్చే నాలుగైదేండ్లు సగటున 5 శాతం వృద్థితో సరిపెట్టుకోవాల్సిందేనన్నారు. 8-10 శాతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోలేమన్నారు. అలాగని 6-7 శాతం వృద్థి కూడా సాధించలేమన్నారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates