తెలంగాణా లో ఉన్నది ప్రజా పాలన కాదు..ముమ్మాటికీ రెడ్ల పాలనే : మంద కృష్ణ మాదిగ

Published on

హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో 24 ఎఫ్రిల్ మంద క్రిష్ణ‌మాదిగ ప్రెస్‌మీట్‌

సీఎం రేవంత్ రెడ్డి కులతత్త్వం తగ్గించుకోవాలి

-ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ M7 ప్ర‌తినిధి

తెలంగాణలో నడుస్తున్న‌ది ప్రజా పాలన కాదని ముమ్మాటికి రెడ్ల పాలన అని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షులు మంద క్రిష్ణ‌మాదిగ ఆరోపించారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఎఫ్రిల్ 24 బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ అధ్య‌క్షులు గోవింద్ న‌రేష్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన రెడ్డి వైఖరి మార్చుకోకపోతే ఆయన మునిగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని మందకృష్ణ మాదిగ జోస్యం చెప్పారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది వాస్తవం కాదని కేవలం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత వారి కుటుంబం పై ఉన్న అవినీతి ఆరోపణలకు విసుగు చెందిన తెలంగాణ ప్రజలు తప్పని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు.. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఒక ఇంట్లో ఇద్దరికీ టికెట్టు ఇవ్వడం అనేది ఉదయపూర్ డిక్లరేషన్ లో లేనప్పటికీ తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టిందని నేడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టి, బీసీలకు ఒక న్యాయం రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.. రేవంత్ రెడ్డి బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లు రెడ్లకు… మాదిగలకే ఇవ్వాల్సిన టికెట్లు మాలల కు ఇచ్చి జనాభాలో అత్యధిక శాతం ఉన్న వర్గాలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. తన తర్వాత సీఎం గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడని ప్రకటించిన రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి ఉన్న భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రులుగా ఉన్న కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ లాంటివాళ్ళు సీఎం పదవికి అర్హులుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డిలో రెడ్డి కులతత్వం ఎంత ఉందో అర్ధమవుతుందని ఇప్పటికైనా ఆయన తన కులతత్వ వైఖరి మార్చు కోవాలని సూచించారు.

రేవంత్ రెడ్డి కి కులతత్వం బాగా పెరిగింది అది వెంటనే తొలిగించుకోవాలి..

ఇలానే ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అడ్రెస్ లేకుంటా పోతది

కులపట్ల అభిమానం ఉండొచ్చు కానీ కులతత్వం ఉండొద్దు

కులతత్వ పోకడల వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు ద్వారా అన్ని వర్గాలకి దూరం అవుతున్నాడు

మొదటి రోజు నుంచి ఇంటలిజెన్స్ నుంచి మొదలుకొని అన్ని కీలక ఆఫీసర్ నియామకం లో రెడ్డి కూలతత్వమే కనిపిస్తుంది

ఒక్క సింగల్ కాస్ట్ కి ఎంపీ , ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారా ?

అగ్రకులలలో బ్రాహ్మణా ,కమ్మ ,వెలమ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారా

నా తరవాత సీఎం గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హులు అని రేవంత్ రెడ్డి అన్నారు .. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అర్హులు అని చెప్పాడు

బీసీ మంత్రి గా కొండా సురేఖ , గిరిజన మంత్రి గా సీతక్క , పొన్నం ప్రభాకర్ , దామోదర్ రాజనరసింహ ఉన్నారు

కాంగ్రెస్ పార్టీ నువ్వే గెలిపించినట్టు అధిష్టానం నమ్మింది అందుకే సీఎం గా చేసారు

నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని హైకమాండ్ భ్రమలో ఉన్నారు

ఫోన్ ట్యాపింగ్ కేస్ విచారణ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని సాంబ శివ రెడ్డి నే నియమించారు

రెడ్డియేతర ఆఫీసర్స్ పట్ల నమ్మకం లేదా ?

నామినేషన్ కి ఒక్క రోజు గడువు ఉన్న ఇంకా ఖమ్మం , కరీంనగర్ , హైదరాబాద్ లో ఎందుకు ఏకాభిప్రాయం రాలేదు .. Sc రిజర్వేషన్ స్థానంలో ఎలా ఏకాభిప్రాయం వచ్చింది

ఇది ప్రజా పాలన కాదు ..ముమ్మాటికీ రెడ్ల పాలననే…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం క్యాబినెట్ 12 మందితో

అందులో ముగ్గురు రెడ్డిసామాజిక వర్గం:

  1. ఉత్తమ్ కుమార్ రెడ్డి,
  2. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  3. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో కీలకమైన పదవులో రెడ్లు
  4. జి. చంద్రశేఖర్ రెడ్డి (ముఖ్యమంత్రి సెక్రెటరీ)
  5. బి. అజిత్ రెడ్డి (ముఖ్యమంత్రి ఓఎస్ఓ)
  6. బి. శివధర్ రెడ్డి (ఇంటలిజెన్స్ చీఫ్)
  7. జైపాల్ రెడ్డి (ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్)
  8. చక్రవర్తి రెడ్డి ( ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్)
  9. ఆయోధ్య రెడ్డి (ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి)
  10. వేం నరేందర్ రెడ్డి (ముఖ్యమంత్రి సలహాదారు)
  11. సుదర్శన్ రెడ్డి (అడ్వకేట్ జనరల్)
  12. రజనీకాంత్ రెడ్డి (అడిషన్ అడ్వకేట్ జనరల్)
  13. మహేందర్ రెడ్డి (టీఎస్పీఎస్సీ ఛైర్మన్)
  14. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (హైదరాబాద్ పోలీస్ కమీషనర్)
  15. కె.శ్రీనివాస్ రెడ్డి (తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్)
  16. కాట అమ్రపాలి రెడ్డి (HMDA)
  17. జి.చిన్నారెడ్డి (ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్)
  18. వేణుగోపాల్ రెడ్డి (T-SAT)
  19. కోదండ రెడ్డి (ధరణి కమిటీ మెంబర్)
  20. సునిల్ రెడ్డి (ధరణి కమిటీ మెంబర్)
    కార్పోరేషన్ పదవులు

(మొత్తం 37 పదవుల్లో 14 రెడ్లకు)

1.పటేల్ రమేష్ రెడ్డి (టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్)

  1. శివసేన రెడ్డి (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ)
  2. అన్వేష్ రెడ్డి (సీడ్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్)
  3. జంగా రాఘవ రెడ్డి (కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గోవర్స్ ఫెడరేషన్)
  4. మనాల మోహన్ రెడ్డి (కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్)
  5. గుర్నాథెడ్డి (పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్)
  6. చల్లా నర్సింహా రెడ్డి (అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్షర్ డెవలప్మెంట్కార్నోరేషన్)
  7. నిర్మలా జగ్గారెడ్డి ( ఇండస్టీరియన్ ఇన్ఫాస్టక్షర్ కార్పోరేషన్)
  8. రాంరెడ్డి మల్రెడ్డి (రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్)
  9. అనిత ప్రకాష్ రెడ్డి (స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్)
  10. నరేందర్ రెడ్డి (శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారటీ)
  11. గిరిధర్ రెడ్డి (తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్)
  12. బండ్రు శోభరాణి (మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్
  13. ఈ. వెంకట్రాం రెడ్డి (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ)

కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ

1.కుంచల వెంకట్ రెడ్డి (కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్)

విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోల్ పై న్యాయ విచారణ కమిషన్

జస్టీస్ ఎల్. నర్సింహా రెడ్డి (పాట్న హైకోర్టు రిటైర్డ్ జడ్జ్)

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్

సాంబశివ రెడ్డి (సీనియర్ న్యాయవాది)

ఎంపీ అభ్యర్ధులు మొత్తం 17 స్థానాల్లో 6 రెడ్లకు)

  1. జీవన్ రెడ్డి (నిజామాబాద్)
  2. చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి)
  3. రఘువీర్ రెడ్డి (నల్గొండ)
  4. పట్నం సునీతా రెడ్డి (మల్కాజిగిరి)
  5. రంజీత్ రెడ్డి (చేవేళ్ల)
  6. చల్లా వంశీచందర్ రెడ్డి (మహాబూబ్ నగర్)

గత వంద రోజుల్లోనే రెడ్డిలకు ఇన్ని పదవులు, ఇన్ని నియామకాలు చేపట్టి రెడ్డిల రాజ్యం చేసారు. ఇది కులతత్వపు పాలన.

Search

Latest Updates