దళితులను గుడిలోకి రానివ్వకుండా అవమానించిన పూజరిని కఠినంగా శిక్షించాలి

Published on

కేవిపిఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

జనగామ జిల్లాకేంద్రం లో తమ పిల్లోడికి జ్ఞాన దంతం వచ్చిందని అర్చన చేయండి అయ్యగారు అని అడిగిన దళిత దంపతులను గుడిలోకి రానివ్వకుండా గెంటివేసిన పూజారి అంజనేయశర్మ అతని భార్య పై ఎస్సి ఎస్టీ కేసు నమోదు కఠినంగా శిక్షించాల ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) రాష్ట్ర కమిటి పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేసింది

ఈ మేరకు కేవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, టి స్కైలాబ్ బాబు లు ఒక ప్రకటన విడుదల చేశారు జనగామ జిల్లా కేంద్రములో ఆంజనేయ స్వామి దేవస్థానాని కి వెళ్లిన దళిత దంపతులు లక్కపెళ్లి భాస్కర్ సంధ్యలు అక్కడే పూజరిగా ఉన్న అంజనేయశర్మ తో తమ పిల్లవాడికి జ్ఞాన దంతం వచ్చింది అర్చన చేయండి అయ్యగారు అని కోరగా మీది ఏమి కులమని అర్చకుడు ప్రశ్నించాడు దీంతో మేము మాదిగొల్లం అని చెప్పడం తో అయ్యగారు మీరు ఇక్కడనుండి వెల్లుపొండి మీ మాదిగొల్లకు ఈ గుడిలోకి రావొద్దు మీకు చెయ్యమని గెంటేశాడు పక్కనే ఉన్న అర్చకుడి భార్య కూడా అలాగే మాదిగోళ్ళు ఈ గుడిలోకి రావొద్దని హెచ్చరించింది. మనమంతా హిందువులం గంగా జల బిందువులం బంధువులం అని మొత్తుకునే కాషాయ ఉన్మాదులు ఈ అవమానానికి ఏమి బదులిస్తారని మూడు వేల ఏళ్లుగా ఈ అవమానాలను దళిత సమాజం భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సదరు అర్చకుడు అతని భార్య పై ఎస్సి ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేవిపిఎస్ డిమాండ్ చేసింది సంఘటన జరిగిన వెంటనే కేవిపిఎస్ తో పాటు దళిత సంఘాలు ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కేవిపిఎస్ డిమాండ్ చేసింది.

కాడిగళ్ళ భాస్కర్
రాష్ట్ర అధ్యక్షులు
టి స్కైలాబ్ బాబు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Search

Latest Updates