డబ్బు కోసం భర్త నీచం!

Published on

  • భార్య నగ్న వీడియోలు ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌
  • వ్యభిచారం చేయాలనీ ఒత్తిడి.. బాధితురాలు వార్డు వలంటీరు
  • దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. పోలీసుల అదుపులో నిందితుడు
  • నేడు వివరాలు వెల్లడిస్తామన్న ఎస్పీ
  • నెట్‌, పోర్న్‌సైట్‌ల నుంచి వీడియోలు, 
  • ఫొటోల తొలగింపునకు యత్నాలు

గుంటూరు : కట్టుకున్న భార్యను నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీయడమే కాక. ఏకంగా వాటిని ఇంటర్‌నెట్‌లో, పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి డబ్బు సంపాదిస్తున్న ఓ భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత వర్గాల కఽథనం మేరకు.. పాతగుంటూరుకు చెందిన రైల్వే లోకో పైలట్‌ కుమారుడు వంశీకాంత్‌రెడ్డి ఎంబీఏ చదివాడు. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన ఓ రైల్వే గార్డు కుమార్తె ఎమెస్సీ చదివింది. అయితే వంశీకాంత్‌రెడ్డి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకొన్నాడు. వారిద్దరికీ  2017లో పెళ్లి చేశారు. అనంతరం దంపతులు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే వంశీకాంత్‌రెడ్డి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేయడం లేదని, అక్కడ కార్గో కార్యాలయంలో పని చేస్తున్నట్లు భార్యకు తెలిసింది.

ఈ విషయంపై నిలదీస్తే నిజమేనని ఒప్పుకున్నాడు. కార్గో కార్యాలయంలో కొంత కాలం పనిచేసి మానేశాడు. ఆ తర్వాత ఇంకొంత కాలం మరో కంపెనీలో పని చేసి అక్కడ కూడా మానేశాడు. చివరకు గుంటూరుకు చేరుకుని బ్రాడీపేటలో కొరియర్‌ కార్యాలయం నిర్వహించాడు. ఎక్కడా సరిగా నిలదొక్కుకోలేదు. కాగా బాధితురాలు వార్డు వలంటీరుగా పని చేస్తోంది. అయితే ఈజీ మనీ కోసం వంశీకాంత్‌రెడ్డి దుష్టఆలోచనకు తెరతీశాడు.

భార్య నిద్రపోతున్నప్పుడు, తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్‌నెట్‌, పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి  సొమ్ము చేసుకున్నాడు. యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేసి సంపాదిస్తున్నట్లు తేలింది. అంతటితో ఆగకుండా భార్యను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. చాలా కాలం ఓపిక పట్టిన బాధితురాలు ఇక తట్టుకోలేక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారితో కలిసి దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహరాన్ని తీవ్రంగా  పరిగణించిన స్టేషన్‌ డీఎస్పీ సుప్రజ.. అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డికి చెప్పారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియ్‌సగా తీసుకుని దర్యాప్తు జరిపించారు. నెట్‌లో, పోర్న్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు పబ్లిక్‌ కాక మునుపే తొలగించే పని చేపట్టారు. అంతేగాక పోలీసులకు విస్తుగొలిపే అనేక నిజాలు తెలిసినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసును అన్నికోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అర్బన్‌ ఎస్పీని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తామని తెలిపారు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates