ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. కాశ్మీర్ భారీగా సైన్యం మొహరింపు

Published on

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి ఆర్టికల్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పెంచారు.జమ్మూకశ్మీర్ పోలీసులు అఖ్నూర్ ఎల్‌ఓసీ ప్రాంతంలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భద్రతా బలగాలు పహారా కాస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇతర భద్రతా సంస్థలు కూడా రవాణా వాహనాలు, పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

పాకిస్తాన్ నుండి ఎలాంటి చొరబాట్లు లేదా ఇతర సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణ జమ్మూ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నామని, ఆగస్టు 5, ఆగస్టు 15దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ట పరిచినట్లు తెలిపారు.

గత నెలరోజులుగా జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. గత జూలైలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోక్‌సభలో సమాచారం ఇస్తూ, ఈ ఏడాది జూలై 21 వరకు, 11 ఉగ్రవాద సంబంధిత సంఘటనల్లో పౌరులు, భద్రతా సిబ్బందితో సహా మొత్తం 28 మంది మరణించినట్లు తెలిపారు.

Search

Latest Updates