ఎల్టీటీఈపై నిషేదం పొడిగింపు

Published on

శ్రీలంకకు చెందిన తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రజల్లో వేర్పాటువాద ధోరణిని పెంచడం, భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లేలా దేశంలో ముఖ్యంగా తమిళనాడులో మద్దతు కూడగట్టడం వంటి చర్యలు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంస్థ శ్రీలంకకు చెందినదైనప్పటికీ భారత్లో మద్దతుదారులు, సానుభూతిపరులు, ఏజెంట్లు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.

2009లో శ్రీలంక చేతిలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత కూడా ఈ సంస్థ తమిళులకు స్వతంత్ర దేశం అనే భావన విడనాడలేదని.. ఇందుకు నిధుల సేకరణ, రహస్య సమావేశాల నిర్వహణ చేస్తోందని వివరించింది. 1976లో ఏర్పడిన ఎల్టీటీఈ అత్యంత ప్రమాదకర ఉగ్రవాద గ్రూపుల్లో ఒకటిగా మారింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ సంస్థను భారత్ నిషేధించింది. అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకోసారి నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది.

Search

Latest Updates