విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల పై విచారణకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిటీని తెలంగాణ ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి నోటిసుల్లో స్పష్టం చేశారు.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ద్రుష్టి సారించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటూ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు రఘు తో సహా మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, అందరూ వివరణ ఇచ్చారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. అయితే జులై 30 వరకు తనకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఒకవేళ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండకపోతే తమ ముందు మళ్లీ విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు జస్టిస్ నరసింహారెడ్డి.