కొడుక్కి బెయిల్.. తండ్రికి జైలు..!

Published on

మహారాష్ట్రలోని పుణెలో మైనర్ బాలుడు పోర్షే కారును నడిపి ఇద్దరి మరణానికి కారణమైన విషయం తెలిసిందే.. ఈ కేసులో బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. 15 గంటల్లోనే బెయిల్ ఇచ్చింది కోర్టు. బాధిత కుటుంబాలు నిందితుడిని శిక్షించాలని నిరసన చేయడంతో.. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన కేసులో బాలుడి తండ్రి, బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ ను ఔరంగాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడికి శిక్షగా  రోడ్డుప్రమాదాలపై ఒక వ్యాసం రాయాలని పనిష్మెంట్ ఇచ్చింది కోర్టు. రోడ్డుప్రమాదాల ప్రభావాలు, వాటి పరిష్కారాలపై 300 పదాలపై వ్యాపాన్ని రాయడంతో పాటు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, సైకాలజిస్ట్ ను సంప్రదించాలని షరతులు విధించింది. అయితే ఈ శిక్ష పట్ల బాధితులు అభ్యంతరం వ్యక్తం చేసాయి.

మైనర్ కు కారు ఇవ్వడం సరికాదని, బెయిల్ ను రద్దు చేసి నిందితుడిని శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారికి అండగా.. అనేక మంది మద్దతు ఇవ్వడంతో పోలీసులు విశాల్ అగర్వాల్ ను మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.

Search

Latest Updates